సీతపాలెం బీచ్ లో యువకుడిని రక్షించిన మత్స్యకారులు

56చూసినవారు
అచ్యుతాపురం మండలం పూడిమడక వద్ద సీతపాలెం బీచ్ లో ఆదివారం సముద్రంలో కొట్టుకుపోతున్న యువకుడిని స్థానిక మత్స్యకారులు రక్షించారు. కొండ ప్రాంతం వద్ద కెరటాల తాకిడికి కొట్టుకుపోతుండటాన్ని గమనించి పర్యాటకులు కేకలు వేశారు. సమీపంలో ఉన్న పూడిమడక ప్రాంతానికి చెందిన మత్స్యకారులు వెంటనే స్పందించి బోటుపై వెళ్లి యువకుడిని బయటకి తీసి ప్రాణాలను కాపాడారు.

సంబంధిత పోస్ట్