ఏపీకి వైజయంతీ మూవీస్ రూ.25 లక్షల విరాళం

80చూసినవారు
ఏపీకి వైజయంతీ మూవీస్ రూ.25 లక్షల విరాళం
ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ ఏపీలో వరద బాధితులను ఆదుకునేందుకు ముందుకొచ్చింది. తమ వంతు సాయంగా ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్‌కు రూ.25 లక్షల విరాళం ఇస్తున్నట్లు ప్రకటించింది. 'ఈ రాష్ట్రం మాకెంతో ఇచ్చింది. ప్రకృతి పరంగా సవాళ్లు ఎదుర్కొంటున్న రాష్ట్రానికి ఇప్పుడు మేం కొంత తిరిగి ఇవ్వాలనుకున్నాం. ఇది మా బాధ్యత' అని పేర్కొంది.

సంబంధిత పోస్ట్