‘దేశంలో జమిలి వచ్చినా రాష్ట్రంలో మాత్రం షెడ్యూలు ప్రకారం 2029లోనే సాధారణ ఎన్నికలు ఉంటాయి.. ముందస్తు ఎన్నికలేవీ ఉండవు’ అని CM చంద్రబాబు స్పష్టం చేశారు. నిన్న ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘విజన్ డాక్యుమెంట్-2047 అమలుపై నిరంతర పర్యవేక్షణ, సమీక్ష ఉంటుంది. వాటిని పూర్తిచేసేలా కార్యాచరణను అమలు చేస్తాం. ‘విజన్’ లక్ష్యసాధన కోసం ఆర్థిక వనరుల సమీకరణకు కూడా వినూత్నపంథాను అమలు చేయబోతున్నాం’ అని ఆయన తెలిపారు.