టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీ నేతలకు ముఖ్యంగా ఎమ్మెల్యేలకు కీలక బాధ్యతలు అప్పగించారు. ఉచిత ఇసుక, మద్యం పాలసీ.. ఈ రెండు విషయాలు కూడా ఆయన ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఉచిత ఇసుకలో జోక్యం చేసుకోవద్దని ఇప్పటికే తెలుగు తమ్ముళ్లను హెచ్చరించారు. ఇక బెల్ట్ షాపులు ఎమ్మెల్యేల కనుసన్నల్లోనే జరుగుతున్నాయని అసెంబ్లీలో ప్రస్తావించారు. ఈ రెండు విషయాల్లో అక్రమాలను నిలువరించే బాధ్యత ఎమ్మెల్యేలకే అప్పగించారు. మరి ఈ బాధ్యతలను ఏ మేరకు సక్సెస్ చేస్తారో వేచి చూడాలి.