AP: పిఠపురంలో నిర్వహించిన జనసేన ఆవిర్భావ కార్యక్రమంలో మంత్రి నాదెండ్ల మనోహర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జనసేన పార్టీ ఎప్పుడూ ప్రజల పక్షాన నిలబడిందని, ఆర్థికంగా నిలబడలేని వ్యక్తులు కూడా పార్టీ కోసం నిలబడ్డారని పేర్కొన్నారు. ఈ ప్రయాణంలో అనేక అవమానాలను ఎదుర్కొన్నామని, మన నాయకుడిని కొంత మంది ఎన్నో ఇబ్బందులు పెట్టారు, తప్పుగా మాట్లాడారు.. అవి మరిచిపోలేమని వ్యాఖ్యానించారు.