మయన్మార్ నుంచి 24 మంది బాధితులు హైదరాబాద్‌కు చేరుకున్నారు. ఉపాధి పేరుతో మయన్మార్ తీసుకువెళ్లి ఓ ముఠా సైబర్ నేరాలు చేయించిన విషయం తెలిసిందే. నగరానికి తిరిగి వచ్చిన వారిలో ఏజెంట్లు, దళారులుగా ఉన్నట్టు సీఐడీ గుర్తించింది. అందులో 15 మంది ఏజెంట్లు, దళారులు ఉన్నట్లు తెలిపింది. హైదరాబాద్‌లో ఉంటూ సైబర్ నేరాలకు పాల్పడిన ఐదుగురిని అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న ఐదుగురు నిందితులు విదేశాల్లో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.