టీటీడీ ఛైర్మన్‌గా బీఆర్ నాయుడును ఏపీ ప్రభుత్వం నియమించింది. తనకు ఈ అవకాశం ఇచ్చినందుకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్‌కు బొల్లినేని రాజ్‌గోపాల్ నాయుడు కృతజ్ఞతలు చెప్పారు. 'నేను అదే జిల్లాకు చెందిన వాడిని. అక్కడ పెరిగిన వాడిని. తిరుమలలో నేను చాలా పనులు చేయాలి. పలు అంశాల్లో ప్రక్షాళన చేయాలి' అని ఆయన వెల్లడించారు.