ఎన్నికల్లో అఖండ విజయాన్ని కట్టబెట్టిన ఉత్తరాంధ్ర రుణం తీర్చుకుంటామని సీఎం చంద్రబాబు తెలిపారు. భోగాపురం ఎయిర్ పోర్టు పనులను ఆయన పరిశీలించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టును నిర్మాస్తామని వెల్లడించారు. విమానాశ్రయాన్ని 2026 జూన్ చివరి నాటికి పూర్తి చేస్తామని ధీమా వ్యక్తం చేశారు.