బుట్టాయగూడెం: పెద్ద ఎత్తున అమ్మవారిని దర్శించుకున్న భక్తులు

61చూసినవారు
బుట్టాయగూడెం మండల పరిధిలో దట్టమైన అటవీ ప్రాంతంలో కొలువైఉన్న శ్రీ గుబ్బల మంగమ్మ అమ్మవారి ఆలయం వద్ద ఆదివారం సందడి వాతావరణం నెలకొంది. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా తోపాటు, తెలంగాణ ప్రాంతం నుంచి సైతం పెద్ద ఎత్తున భక్తులు విచ్చేసి అమ్మవారిని దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులు, స్నేహితులతో వచ్చిన భక్తులు ఆలయం వద్ద సెలయేటి అందాలను తిలకిస్తూ, ఫొటోలు దిగుతూ, ఆహ్లాదంగా గడిపారు.

సంబంధిత పోస్ట్