పెనుమంట్రలో ఫ్రైడే డ్రై డే కార్యక్రమం

74చూసినవారు
పెనుమంట్రలో ఫ్రైడే డ్రై డే కార్యక్రమం
పెనుమంట్ర మండలం పెనుమంట్ర, బ్రాహ్మణ చెరువు సచివాలయాల పరిధిలో.. ఏఎన్ఎంలు భాగ్య కుమారి, లక్ష్మి, ఆశా సిబ్బంది ఆధ్వర్యంలో శుక్రవారం ఫ్రై డే డ్రై డే కార్యక్రమం నిర్వహించారు. స్థానికులకు పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. వర్షాకాలంలో ఇళ్ల వద్ద చెత్త, పనికిరాని, పాడైపోయిన వస్తువులు ఉంచరాదని అన్నారు. ఈ కార్యక్రమం లో సర్పంచ్ ప్రియాంక, ఉప సర్పంచ్ శ్రీనివాస్ రాజు, సచివాలయ సిబ్బంది,తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్