రాష్ట్రస్థాయిలోనే ఉత్తమ డ్రగ్ ఇన్స్పెక్టర్ గా అబిద్ అలీ అవార్డు అందుకున్నారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని గురువారం విజయవాడలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో డ్రగ్ కంట్రోల్ డీజీ లక్ష్మీషా చేతుల మీదుగా ఈ అవార్డును అందుకున్నారు. ప్రస్తుతం భీమవరం డ్రగ్ ఇన్స్పెక్టర్ గా పనిచేస్తున్న అబిద్ ఆలీ గతంలో నార్కోటిక్ డ్రగ్స్ పై చేసిన దాడులు, విధుల్లో కనబరిచిన ప్రతిభ ఆధారంగా అవార్డును అందుకున్నారు.