తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాసును ఆర్టీసీ కార్మిక నాయకులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో భాగంగా బొలిశెట్టి శ్రీనివాసు మాట్లాడుతూ తాడేపల్లిగూడెం డిపోలో ఉన్న సమస్యలన్నీ ముఖ్యమంత్రితో మాట్లాడి పరిష్కరిస్తారని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు శ్రీనివాసరావు, పివిఆర్ రెడ్డి జిల్లా నాయకులు వై వి రావు, సూర్యచంద్రరావు, రవి, రత్నం, పూళ్ల శంకర్, కొండ నిరంజన్ తదితరులు పాల్గొన్నారు.