భీమవరం పట్టణంలో కొలువైన శ్రీశ్రీ మావుళ్లమ్మ
తల్లి హుండీ ఆదాయ లెక్కింపు కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ సహాయ కమిషనర్ మాట్లాడుతూ. హుండీ 92 రోజులకు లెక్కించగా రూ. 69, 20, 286, 154 గ్రాముల బంగారం, 590 గ్రాముల వెండి వచ్చినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఆలయ సిబ్బంది, అర్చకులు పాల్గొన్నారు.