ఏలూరు జిల్లాలో ప్రజా రవాణా అధికారిగా పనిచేసి పగో జిల్లా ప్రజా రవాణా అధికారిగా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా భీమవరం ఆర్టీసీ నేషనల్ మజ్దూర్ యూనియన్ అసోసియేషన్ నాయకులు వారికి శాలువా కప్పి పుష్పగుచ్చం ఇచ్చి అభినందనలు తెలియజేశారు. పగో జిల్లా ఆర్టీసీ ని మరింత అభివృద్ధి పదంలోకి తీసుకుని వెళ్లాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ నాయకులు వై. వి రావు ఏడుకొండలు, సోమరాజు, తదితరులు పాల్గొన్నారు.