బొమ్మిడి నాయకర్ భారీ మెజార్టీతో విజయం సాధించడం పట్ల భీమవరం నియోజకవర్గం ఒకటో పట్టణంలో జనసేన, టీడీపీ, బీజేపీ కుటమి నాయకుల ఆధ్వర్యంలో మంగళవారం పెద్ద ఎత్తున కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. నాయకర్ విజయానికి కృషిచేసిన నాయకులకు, కార్యకర్తలకు, ప్రజా ప్రతి నిధులకు, వీర మహిళలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. రానున్న రోజుల్లో ఏ ఎన్నికలు జరిగినా కుటమిదే విజయం అనే విధంగా అందరు కష్టపడి పని చేసి ముందుకు పోవాలన్నారు.