దెందులూరు నియోజకవర్గంలో 2, 24, 682 మంది ఓటర్లు
ఏలూరు జిల్లాలో జనవరి 2025 నాటికి 18 ఏళ్లు నిండిన ప్రతిఒక్కరూ ఓటరుగా నమోదు కావాలని జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి తెలిపారు. మంగళవారం ఏలూరు కలెక్టరేట్ గౌతమీ సమావేశ మందిరంలో ఎస్ఎస్ఆర్ -2025 డ్రాఫ్ట్ పబ్లికేషన్ ను జిల్లా కలెక్టర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా దెందులూరు నియోజకవర్గంలో 1, 09, 286 మంది పురుష ఓటర్లు, 1, 15, 388 మంది మహిళలు, 08 మంది థర్డ్ జెండర్ ఓటర్లు కలిపి మొత్తం 2, 24, 682 మంది ఓటర్లు ఉన్నారన్నారు.