నరసాపురం: ముక్కోటి ఏకాదశికి ఏర్పాట్లు పూర్తి

80చూసినవారు
నరసాపురంలో ఆదికేశవ ఎంబెరుమానార్ ఆలయంలో ఈనెల10 నుంచి ఉత్సవాలు ప్రారంభం కానున్నట్లు ఆలయ ధర్మకర్త పుప్పాల కృష్ణారావు చెప్పారు. బుధవారం ఆలయంలో ఆయన విలేకర్లతో మాట్లాడారు. ముక్కోటి ఏకాదశి పురస్కరించుకుని ధనుర్మాస ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. దానిలో భాగంగా 10న వైకుంఠ ఏకాదశి ద్వారా దర్శనం, 13న భోగి కళ్యాణం వంటి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్