ట్విట్టర్లో ఐఏఎస్ అధికారి స్మిత సబర్వాల్ చేసిన వ్యాఖ్యలు దివ్యాంగులను అవమానించేలా ఉన్నాయని వెంటనే దివ్యాంగులకు ఆమె క్షమాపణ చెప్పాలని నిడదవోలులోని జ్యోతిర్మయి దివ్యాంగుల సంక్షేమ సంఘం అధ్యక్షులు ర్యాలి శివ డిమాండ్ చేశారు. మంగళవారం ఆయన ఓప్రకటన విడుదల చేశారు. స్మిత సబర్వాల్ దివ్యాంగులు అంటే తమకు ఎంతో గౌరవం అంటూనే హేళనచేయడం తగదన్నారు. ఆమెక్షమాపణ చెప్పకపోతే దివ్యాంగులందరూ పెద్ద సంఖ్యలో ఉద్యమిస్తామని హెచ్చరించారు.