నూజివీడు: పేద ప్రజలకు అండగా సీఎం రిలీఫ్ ఫండ్
ముఖ్యమంత్రి చంద్రబాబు పేదల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని రాష్ట్రంలోని పేద ప్రజలందరికి సిఎం రిలీఫ్ ఫండ్ ద్వారా మెరుగైన వైద్య సహాయం అందిస్తున్నారని టిడిపి రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ ముద్దరబోయిన వేంకటేశ్వరావు అన్నారు. నూజివీడు క్యాంపు కార్యాలయంలో సోమవారం ఆగిరిపల్లి మండలం వడ్లమానుకి చెందిన తులిమెల్లి వెంకట రమణకు 51, 278రూ చెక్కు మంజూరయ్యిందని, అది నేరుగా లబ్దిదారుని ఇంటి వద్దకే వస్తుందని తెలిపారు.