గంపలగూడెం మండలం వినగడప - కట్టలేరు వంతెన నిర్మాణం తక్షణమే ప్రారంభించాలని తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శనివారం అసెంబ్లీలో ప్రభుత్వానికి విన్నవించారు. ఈ వంతెన ఆరేళ్ల క్రితం కూలిపోయిందని ఇటీవల వచ్చిన వర్షాలకు వంతెన పక్కనున్న చప్టా సైతం దెబ్బతిందని కొలికపూడి చెప్పారు. త్వరితగతిన టెండర్లు పిలిచి తక్షణమే ఈ వంతెన పనులు ప్రారంభించి 2 మండలాల రెండు రాష్ట్రాల ప్రజల రాకపోకలకు ఇబ్బంది కలగకుండా చూడాలన్నారు.