సీఎం చంద్రబాబు ఆదేశాలతో శుక్రవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు న్యూఢిల్లీ వెళ్లారు. కేంద్ర జల వనరుల మంత్రిత్వ శాఖ కార్యాలయంలో కేంద్ర జల వనరుల శాఖ కార్యదర్శి దేవ శ్రీ ముఖర్జీ ను మంత్రి నిమ్మల కలిసి పుష్పగుచ్చం అందజేసారు. జల వనరుల మంత్రిత్వ శాఖ ముఖ్య అధికారులతో సమావేశమయ్యారు. పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతి, రావలసిన అనుమతులపై సమీక్ష జరిపారు.