సంక్రాంతి సంబరాల్లో భాగంగా పాలకొల్లులో ధర్మారావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరుగుచున్న కలిదిండి రామరాజు సౌత్ స్టేట్ లెవెల్ వాలీబాల్ పోటీల్లో రెండో రోజు ఆదివారం రాత్రి ప్లడ్ లైట్లలో ఉత్కంఠంగా సాగాయి. స్థానిక బిఆర్ఎంవి మున్సిపల్ ఉన్నత పాఠశాల గ్రౌండ్లో జరిగిన ఈ పోటీల్లో మహిళలు, పురుషుల వేర్వేరు విభాగాలకు జరిగిన పోటీలో వివిధ జిల్లాల నుంచి వచ్చిన జట్ల క్రీడాకారులు గెలుపు కోసం హోరాహోరీగా తలబడ్డారు.