తాడేపల్లిగూడెం పట్టణం, రూరల్ పెంటపాడు మండలంలో సోమవారం రాఖీ పండుగ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆడపడుచులు తమ సోదరులకు రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు. సోదరులు తమ ఆడపడుచులకు బహుమతులను అందజేశారు. సోదరభావానికి ముహూర్తాలతో సంబంధం లేదని చాటి చెప్పారు. ఏదేమైతేనేం, రాఖీ వేడుకలు ఘనంగా నిర్వహించారు.