ఆర్డీఎస్ఎస్ స్కీంలో భాగంగా మరమ్మతుల నిమిత్తం హౌసింగ్ బోర్డు విద్యుత్ సబ్ స్టేషన్ పరిధిలో సత్యవతి నగర్, నిట్ ఫీడర్ పరిధిలో ఆదివారం 9 గంటల నుంచి 11 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపి వేస్తామని ఏపీఈపీడీసీ ఎల్ తాడేపల్లిగూడెం డివిజన్ ఈఈ ఎన్. వెంకటేశ్వరరావు వెల్లడించారు. వన్ టౌన్ లోని వానపల్లిగూడెం, వీకర్స్ కాలనీ, ఎఫ్ సీఐ కాలనీ, గాయత్రి గుడి ఏరియాలలో విద్యుత్ సరఫరా నిలిపివేస్తామని వినియోగదారులు సహకరించాలన్నారు.