తణుకు, వేల్పూరు, పైడిపర్రు విద్యుత్ సబ్ స్టేషన్ల పరిధిలోని లైన్లు మరమ్మత్తులు నిమిత్తం శనివారం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు డీఈ రామకృష్ణ తెలిపారు. వేల్పూరు రోడ్డు, వెంకటరాయపురం, వేల్పూరు, మండపాక, పైడిపర్రు, కావలిపురం, రేలంగి గ్రామాల్లో సరఫరా నిలిపివేస్తున్నందున వినియోగదారులు సలహాకరించాలని విజ్ఞప్తి చేశారు.