ఆకివీడులోని శ్రీరామపురం ప్రాంతంలో గుగ్గిళ్ల రవితేజ ఇంట్లో చోరీ జరిగింది. ఆయన 15 రోజుల కింద ఇంటికి తాళం వేసి హైదరాబాద్ వెళ్లారు. బంధువులు ఆదివారం వచ్చి చూసే సరికి ప్రధాన ద్వారం తాళం పగులగొట్టి ఉంది. లోపలికి వెళ్లి పరిశీలించగా. బీరువా తలుపులు తెరిచి ఉన్నాయి. నగలు, నగదు చోరీకి గురైనట్లు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. SI నాగబాబు, సిబ్బంది ఘటనా స్థలాన్ని పరిశీలించి, వివరాలు నమోదు చేసుకున్నారు.