పెనుమంట్ర మండలం మార్టేరు గ్రామంలోని ప్రధాన సెంటర్ లో పాత వంతెన వద్ద నుంచి కొత్త వంతెన మధ్యలో గల రహదారి లో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు గుంతలు ఏర్పడ్డాయి. స్థానిక ఎమ్మెల్యే పీతాని సత్యనారాయణ ఆదేశాల మేరకు సోమవారం ముమ్మరంగా మరమ్మత్తులు చేపట్టారు. ఈ నేపథ్యంలో భారీ వాహనాలు అటువైపు రాకుండా ఆంక్షలు విధించారు. స్థానిక కూటమి నాయకులు రహదారి నిర్మాణాన్ని పర్యవేక్షించారు.