రక్తదాన శిబిరం నిర్వహించిన బీజేపీ శ్రేణులు

276చూసినవారు
రక్తదాన శిబిరం నిర్వహించిన బీజేపీ శ్రేణులు
ప్రధాని నరేంద్ర మోదీ పుట్టిన రోజును పురస్కరించుకుని ఆచంట నియోజకవర్గంలో బీజేపీ నాయకులు రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని సేవా సప్తాహం కార్యక్రమంలో భాగంగా గురువారం యువ మోర్చా, ఇండియన్ రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో రక్త దాన శిబిరాన్ని ఏర్పాటుచేశారు. కార్యక్రమంలో నాయకులు కనకరెడ్డి,ఆచంట మండల అధ్యక్షుడు ఎం.నాగా సుబ్బారావు,పెనుగొండ మండల అధ్యక్షుడు చక్రపాణి,గంట రాజు,ప్రసాద్ రెడ్డి,కడలి రాజు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్