జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్బంగా ఆచంట నియోజకవర్గంలో ఐదు రోజులు వేడుకలు నిర్వహించడం జరుగుతుంది.అందులో భాగంగా మూడవ రోజు గురువారం ఉదయం పెనుమంట్ర మండలం,మార్టేరు గ్రామంలో జనసేనపార్టీ ఉమ్మడి పగో జిల్లా జాయింట్ సెక్రటరీ షేక్ ముంతాజ్ బేగం ఆలీ ఆర్థిక సహాయం తో మార్టేరు వేణుగోపాలస్వామి జిల్లా పరిషత్ హైస్కూల్లో మొక్కలు నాటే కార్యక్రమం చేయడం జరిగింది.