పెనుమంట్ర మండలం లో ముమ్మరంగా పెన్షన్ల పంపిణీ

79చూసినవారు
పెనుమంట్ర మండలం లో ముమ్మరంగా పెన్షన్ల పంపిణీ
పెనుమంట్ర మండల వ్యాప్తంగా శనివారం వేకువజాము నుంచీ ముమ్మరంగా పెన్షన్ల పంపిణీ నిర్వహించారు. పెనుమంట్ర, కొయ్యేటిపాడు, మార్టేరు, వెలగలేరు, జుత్తిగ, నత్తారామేశ్వరం, మల్లిపూడి, పొలమూరు, మాముడూరు, సోమరాజు ఇల్లింద్రపర్రు తదితర అన్ని గ్రామాలలో జోరున వాన కురుస్తున్నప్పటికీ స్థానిక సచివాలయ సిబ్బంది, పలు శాఖల లోని ఉద్యోగులు ఇంటింటికీ వెళ్ళి పెన్షన్లు అందచేశారు. ఉద్యోగుల నిబద్దత పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్