ఏపీలో పింఛన్ల పంపిణీ వేగంగా సాగుతోంది. ఉదయం నుంచే నగదును లబ్ధిదారులకు అందజేస్తున్నారు. భారీ వర్షాలు కురుస్తున్న ప్రాంతాలు మినహా ఇతర చోట్ల పంపిణీ చేపట్టారు. ఇప్పటి వరకు 56 శాతం పింఛన్ల పంపిణీ పూర్తయింది. సెప్టెంబర్ 1న సెలవు కావడంతో ఒక రోజు ముందుగానే పింఛన్ల పంపిణీ చేపట్టారు.