తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాగులు, వంకలు పొంగి వరదలు సంభవిస్తున్నాయి. ఈ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకుందాం.
• వరద నీటిలోకి ప్రవేశించవద్దు.
• మురుగునీటి కాలువలు, కల్వర్టులకు దూరంగా ఉండండి.
• పడిపోయిన విద్యుత్ లైన్లకు, విద్యుత్ స్తంభాలకు దూరంగా ఉండండి.
• వరద నీటిలో నడవకండి, రెండు అడుగుల మేర ప్రవహించే వరద నీరు పెద్ద కార్లను కూడా తోసుకుపోగలవు గుర్తుంచుకోండి.
• వరద ప్రవహించే వాగులు, వంకలు, కాలువలు దాటే ప్రయత్నం చేయకండి.