పెనుగొండ మండలంలోని ప్రధాన రహదారిలో వాసవి బ్రిక్స్ వద్ద బుధవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు సైకిల్‌పై వెళుతున్న వ్యక్తిని ఢీకొట్టారు. ఈ ఘటనలో సైకిల్‌పై వెళుతున్న వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు వెంటనే 108 అంబులెన్సు ద్వారా క్షతగాత్రుడిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.