పెనుమంట్ర మండలం పెనుమంట్ర గ్రామంలో వేంచేసి ఉన్న గ్రామ దేవత శ్రీ కనకదుర్గ అమ్మవారి జాతర మహోత్సవ కార్యక్రమం బుధవారం రాత్రి ఘనంగా నిర్వహించారు. ప్రతీ ఏటా కనుమ పండుగ రోజున గ్రామంలో జాతర నిర్వహించడం అనేక సంవత్సరాలనుండి ఆనవాయితీగా వస్తుంది. మేళ తాళాలతో, గరగలు నృత్యాలు ఆకట్టుకోగా, జాతర వీక్షించేందుకు పెద్ద ఎత్తున జనం తరలివచ్చారు