పెనుమంట్ర మండలం నెలమూరులో శనివారం నిర్వహించిన రెవెన్యూ సదస్సుకు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ హాజరయ్యారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలనుంచి వచ్చిన వినతులను కలెక్టర్ పరిశీలించారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. భూ సమస్యలను పరిష్కరించేందుకే ప్రభుత్వం రెవెన్యూ సదస్సులను నిర్వహిస్తోందని అన్నారు.