పెనుగొండ గ్రామపంచాయతీ వద్ద సోమవారం ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ హాజరయ్యారు. అనంతరం ఇళ్ల స్థలాలు, రేషన్ కార్డులు, పింఛన్లు, ఇంటి నిర్మాణం కొరకు ప్రజల నుండి దరఖాస్తులను స్వీకరించటం జరిగింది. అర్హత ఉన్న ప్రతి వ్యక్తికి పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాల అందించాలన్నదే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లక్ష్యమని అన్నారు.