వర్షాకాలం వచ్చినా గాని సరిగ్గా వర్షాలు లేకపోయినా పెనుమంట్ర మండలం ఆలమూరు గ్రామంలో ముంపుకి గురైన వీధులునీరు వెళ్లడానికి దారి లేక ఈ మురుగునీరులోనే ప్రజలు అనే ఇబ్బందులు పడుతున్నారు. అంటువ్యాధులు ప్రబళితే ఎవరు బాధ్యత వహిస్తారని సిపిఎం పార్టీ పెనుమంట్ర మండల కార్యదర్శి కే సుబ్బరాజు మంగళవారం ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని ఆయన తెలిపారు.ఇందులో స్థానికులు, సిపిఎం పార్టీ నాయకులు పాల్గొన్నారు.