ప్రభుత్వం ద్వారా సరసమైన ధరలకే అందిస్తున్న సరుకులను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు) అన్నారు. గురువారం భీమవరంలోని ఓవర్ వద్ద మున్సిపల్ కాంప్లెక్స్ లో చౌక ధరలకు టమోటా, వంట నూనెలు, ఉల్లిపాయల అమ్మకాలకు ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్లను జిల్లా కలెక్టర్ నాగరాణి, ఎమ్మెల్యే అంజిబాబు ప్రారంభించారు.