గల్ఫ్ లో ప్లంబింగ్ పని ఇప్పిస్తామని చెప్పి బాధితుడి నుంచి భీమవరం ప్రకాశ్ నగర్ కు చెందిన రామలక్ష్మి రూ. 1. 50 లక్షలు తీసుకున్నారు. తరువాత అతడిని మలేసియా పంపి ఓ హోటల్లో పనికి కుదిర్చారు. అక్కడ జీతం ఇవ్వకుండా వేధించడంతో బాధితుడు సొంత ఖర్చులతో స్వదేశానికి వచ్చేశారు. ఖర్చుల గురించి రామలక్ష్మిని అడగ్గా బెదిరించారని బాధితుడు మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేయగా ఎస్సై కిరణ్ కుమార్ రెడ్డి కేసు నమోదు చేశారు.