ఢిల్లీలో రైతులు చేస్తున్న పోరాటం విజయం సాధించాలని.. వీరవాసరం మండలంలో రైతు సంఘం ఆధ్వర్యంలో శనివారం మోటార్ సైకిల్, ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించారు. వ్యవసాయం నిలవాలి.. కార్పొరేట్లను తరమాలి అన్న నినాదంతో ర్యాలీ నిర్వహించారు. అదేవిధంగా వ్యవసాయ రంగాన్ని కాపాడుకుందామని పచ్చని పంట పొలాలు రక్షించుకుంటూ రైతుకు అండగా ఉండాలని వారు కోరారు.