పశ్చిమగోదావరి జిల్లాలోని అర్హులందరికీ ఉచిత గ్యాస్ సిలిండర్ల సరఫరా దీపం-2 పథకం అమలకు అన్ని చర్యలు తీసుకున్నామని జిల్లా రెవెన్యూ అధికారి మొగిలి వెంకటేశ్వర్లు అన్నారు. కలెక్టరేట్ డీఆర్ఓ ఛాంబర్లో దీపం-2 పథకంపై మీడియా సమావేశాన్ని జిల్లా రెవెన్యూ అధికారి నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఈ పథకం క్రింద ప్రతి రైస్ కార్డుదారునికి సంవత్సరానికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు పంపిణీకి అన్ని చర్యలు తీసుకున్నామని తెలిపారు.