చింతలపూడి మండలం నాగిరెడ్డిగూడెంలో సోమవారం నాటు సారా కేంద్రాలపై ఎక్సైజ్ అధికారులు దాడులు చేశారు. దేశవతు బాలు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకోని 2 లీటర్ల నాటు సారా స్వాధీనం చేసుకున్నారు. అనంతరం అధికారులు మాట్లాడుతూ నాటు సారా తయారుచేసి విక్రయించిన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.