2047 నాటికి అభివృద్ధి చెందిన భారత్ గా ఉండాలన్నదే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల లక్ష్యంలో బాగంగా రానున్న ఏడాదికి 15 శాతం వృద్ధి సాధించే దిశగా జిల్లా ప్రణాళిక సిద్ధం చేయాలని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి ఆదేశించారు. శుక్రవారం ఏలూరు కలెక్టర్ కార్యాలయ గౌతమీ సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో వికసిత్ ఆంధ్రా-2047 జిల్లా యాక్షన్ ప్లాన్ 2024-29 పై జిల్లా అధికారులతో వర్క్ షాప్ నిర్వహించారు.