ఏలూరు జిల్లా పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన 78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు. జాతీయ జెండాను ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్ చైర్ పర్సన్ ఘంటా పద్మశ్రీ ప్రసాద్ ఆవిష్కరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ఎంతోమంది త్యాగమూర్తుల ప్రాణ త్యాగమే మనకు స్వాతంత్య్రం తెచ్చిందని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ ముఖ్యకార్యనిర్వాహన అధికారి కె. ఎస్. ఎస్ సుబ్బారావు, తదితరులు పాల్గొన్నారు.