ఆంధ్రప్రదేశ్ జమాతే ఇస్లామీ హింద్ ఆధ్వర్యంలో విజయవాడ కుమ్మరిపాలెం ఈద్ గాహ్ మైదానంలో వక్ఫ్ పరిరక్షణ సభకు ఏలూరు నుంచి పెద్ద సంఖ్యలో ముస్లింలు బయలుదేరారు. ఆదివారం బస్సులను ఏలూరుకు చెందిన ముస్లిం మత పెద్ద షేక్ ఇసాక్ మొహిద్దిన్ జెండా ఊపి ప్రారంభించారు. వక్ఫ్ చట్టసవరణ బిల్లు చాలా ప్రమాదకరమని, ముస్లింల నుంచి విలువైన భూములను కాజేయాలని దురుద్దేశంతో ఈ కుట్ర జరుగుతోందని ఆయన తెలిపారు.