స్వాతంత్ర్యం వచ్చాక భారతదేశానికి మొట్టమొదటి హోంమంత్రిగా సేవలందించిన సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ దేశరక్షణ, సమగ్రతకు ఎంతో కృషి చేశారని డిప్యూటీ కలెక్టర్ భాస్కరరావు అన్నారు. ఏలూరు కలెక్టరేట్లోని గౌతమి సమావేశ మందిరంలో గురువారం ఆయన జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ఇన్ఛార్జ్ డీఆర్ఓ భాస్కరరావు, తదితరులు పాల్గొన్నారు.