కోర్టు ప్రాంగణమునందు ఘనంగా వేడుకలు

61చూసినవారు
కోర్టు ప్రాంగణమునందు  ఘనంగా వేడుకలు
ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ప్రధాన న్యాయమూర్తి సి. పురుషోత్తం కుమార్ ఆధ్వర్యంలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జిల్లా కోర్టు ప్రాంగణమునందు గురువారం ఘనంగా నిర్వహించారు. ముందుగా ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ప్రధాన న్యాయమూర్తి సి పురుషోత్తం కుమార్ పోలీస్ గౌరవ వందనం స్వీకరించి త్రివర్ణ ప్రతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రెండవ అదనపు జిల్లా జడ్జి మంగాకుమారి, ఐదవ అదనపు జిల్లా జడ్జి రాజేశ్వరీ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్