ఆకట్టుకున్న ప్రభుత్వ స్టాల్స్

53చూసినవారు
ఆకట్టుకున్న ప్రభుత్వ స్టాల్స్
78వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్బంగా పలు ప్రభుత్వ శాఖలు ఏర్పాటు చేసిన స్టాల్స్ ను అందరిని ఆకట్టుకున్నాయి. గురువారం ఏలూరు పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహించిన వేడుకల సందర్బంగా ఏర్పాటు చేసిన వివిధ ప్రభుత్వ స్టాల్స్ ను రాష్ట్ర గృహనిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖా మంత్రి కొలుసు పార్ధసారధి, జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి, జిల్లా జడ్జి సి. పురుషోత్తమ కుమార్, జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివకిషోర్ తదితరులు సందర్శించారు.

సంబంధిత పోస్ట్