ఏపీ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఏలూరులోని ప్రభుత్వ డీఎల్టీసీ, ఐటిఐ కళాశాలలో ఈనెల 30న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ పి. రజిత సోమవారం తెలిపారు. ఈ జాబ్ మేళాలో 170 మందికి ఉద్యోగ అవకాశం కల్పిస్తామన్నారు. అభ్యర్థులు 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ, పీజీలలో ఉత్తీర్ణులై ఉండాలన్నారు. 18 నుంచి 30 ఏళ్ల వయస్సు వారు అర్హులని తెలిపారు.