ఏలూరు జిల్లాలో మద్యం దుకాణాలకు సంబంధించి లాటరీ ప్రక్రియను సోమవారం జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి ప్రారంభించారు. ఏలూరు రూరల్ మండలం వట్లూరు బైపాస్ వద్ద ఉన్న చలసాని గార్డెన్ లో జిల్లాకి సంబంధించి 144 మద్యం దుకాణాలకు లాటరీ ప్రక్రియ చేపట్టారు. మొత్తం 5499 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. ఈ సందర్భంగా ఎలాంటి ఆవాంఛనీయ సంఘటనలు జరగకుండా పట్టిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.